![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -800 లో.....అప్పు తల్లి కాబోతున్నదని తెలిసి కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పు చేత ఏం పని చేయించడు.. అదంతా కావ్య చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు నా భర్త నా పక్కన లేడని బాధపడుతుంది. అదంతా అపర్ణ, ఇందిరాదేవి చూసి ధాన్ని మనం అయిన జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటారు.
మరొకవైపు గతంలో కావ్య ప్రెగ్నెంట్ అని రాజ్ పొరపాటు పడిన విషయం గుర్తుచేసుకొని కావ్య బాధపడుతుంది. మరుసటిరోజు కావ్య అందరికి టీ లు ఇస్తుంటే ఇక నుండి నువ్వు కిచెన్ లోకి రాకు అని ఇందిరాదేవి, అపర్ణ చెప్తారు. ఏంటి ఈ రూల్ అప్పు ప్రెగ్నెంట్ అవుతుంది.. కావ్య కాదు ఎందుకు తనకి రెస్ట్ అని రుద్రాణి అంటుంది. ఇంతమంది ఉండగా నా కోడలు ఎందుకు పని చేయాలని అపర్ణ అంటుంది. ఆ తర్వాత వీళ్ళ కేరింగ్ చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది ఈ మధ్య కావ్య టాబ్లెట్ వేసుకుంటుంది.. అవి ఎందుకు వాడాతారో చూడాలని రుద్రాణి అనగానే రాహుల్ ఫోటో తీసుకొని వస్తాడు. ఆ టాబ్లెట్స్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వాడతారని రుద్రాణి అనగానే.. రాహుల్ షాక్ అవుతాడు.
ఆ తర్వాత అపర్ణ దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. నా కోడలు చేత వరలక్ష్మి వ్రతం చేయిస్తానంటుంది. అప్పుతో ఎందుకు ముగ్గురు కోడళ్ళతో చేయించమని అపర్ణ అంటుంది. కానీ కావ్య నా ఆశీర్వదించడానికి రాజ్ కి తెలియదు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నేను ఏదో చేస్తాను గానీ ముందు వెళ్లి ఏర్పాట్లు చెయ్ అని అపర్ణ అంటుంది. అప్పుడే స్వరాజ్ భోజనం చేస్తాలేడని అపర్ణకి ఫోన్ చేస్తుంది రేవతి. అపర్ణతో స్వరాజ్ మాట్లాడతాడు. తరువాయి భాగం లో స్వరాజ్ నువ్వుల వెళ్లి ఆ అంటీకీ కంగ్రాట్స్ చెప్పు తన కడుపులో లో నీలాంటి బుజ్జి బేబీ ఉందని స్వరాజ్ కి చెప్పి పంపిస్తుంది రుద్రాణి. స్వరాజ్ వెళ్లి విషెస్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |